బ్రెయిన్ డెడ్ అంటే....! ! !
§
§
మనది
సంక్షేమ రాజ్యం. ప్రజా ప్రభుత్వం....అని చెప్పుకుంటూటాం కదా...అది బాగా అర్థం
కావాలంటే..పండుగలు, పబ్బాలకు ప్రభుత్వం నడిపే బస్సులు, రైళ్ళ వ్యవహారం చూస్తే
చాలు. రద్దీకి తగ్గట్లు నడిపే సామర్ధ్యం దానికి ఎటూ ఉండదు. ఉన్న కొన్నింటిలో కూడా సాధారణ చార్జీలకు రెండు మూడింతలు
పెంచి వసూలు చేస్తారు...ప్రజల ప్రయోజనాలే
ముఖ్యం అనుకుంటే ...నిజానికి అప్పుడు తక్కువ చార్జీలతో సర్వీసులను పెంచాలి కదా. అలా కాక చార్జీలు దారుణంగా పెంచేసి... ప్రయివేటు దోపిడీకి కూడా ప్రభుత్వమే దారి
చూపుతుంటుంది. వీటికి పరాకాష్ట... లాక్
డౌన్ కష్టకాలంలో... ప్రాణాలను, సంసారాలను మూటలు కట్టి నెత్తిన పెట్టుకుని ఇంటిబాట
పట్టిన వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం
వారి కోసమే అని చెప్పి నడిపిన సాధారణ
రైళ్ళలో కూడా ఇవే ఫైవ్ స్టార్ చార్జీలు ముక్కుపిండి వసూలు చేయడం...ఇదేమిటని
అడిగితే పక్కా వ్యాపారుల్లాగా లాభనష్టాల లెక్కలను ప్రభుత్వం చెప్పడం...
అదీ మనం అనుభవిస్తున్న సంక్షేమ రాజ్యం.
§
సహాయం
ఎవరికి అవసరమో వారికి నోటికి ముద్ద అందించాలి కదా !... అన్నపూర్ణ క్యాంటీన్లను
ప్రారంభించారు...ఇక్కడ తినేది కేవలం నిరుపేదలే కాదు, అందరికీ ఓపెన్ ఇవి..... అలాగే రైతు బంధు- పేద రైతుకు పెట్టుబడి సాయం
అందించేందుకని చెప్పి తెచ్చిన పథకం...మంత్రులు, కోటీశ్వరులు అందరూ లబ్డిదారులే ...ఇప్పటికీ
కౌలు రైతుల దిక్కులేని చావులు మనకు మాత్రమే కనిపిస్తుంటాయి...రైతుబంధవులమంటూ
ప్రకటనలు గుప్పించుకునే ప్రభుత్వాలకు మాత్రం ఇవి కనిపించవు.
§
ఆర్థికంగా
కటకటగా ఉన్న ఏ కుటుంబం కూడా ....ఉన్న
ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకుంటుందా ?
ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి నేరుగా వారి పర్యవేక్షణలో ఉండే పెట్రోలు ధరలనే
తగ్గించకుండా...ఎవరి వాటా పన్నులు వారు పిండుకుంటూ.. కసికొద్దీ పెంచుకుంటూ పోతూన్న
ప్రభుత్వాలకు....లక్షణంగా ఉన్న సెక్రటేరియట్, పార్లమెంటు భవనాలను కూల్చి,
రాజధానులను మార్చి కొత్త వాటికోసం ఆరాటపడడం....దేనికి సంకేతం ???
బ్రెయిన్ డెడ్ కేసనే అనుమానం రావడం లేదా...!!!!
ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని నేను గుర్తు చేసాను. మరికొన్ని
మీరు గుర్తు చేయండి....ఇలా చేసుకుంటూ పోతుంటే...ఎక్కడో ఒక చోట ఆ వేడి ప్రభుత్వాలకు
చురుక్కుమనిపించకుండా ఉంటుందా....
మౌనంగా ఉంటే వారి పాలనా సామర్థ్యాన్ని మనం
అంగీకరించినట్లుగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి... గల్లీ స్థాయి ఎన్నికల తాలూకు ఓట్ల
మెజారిటీని చూపి ప్రజలు ఆమోదించేసారంటూ ...ఢిల్లీస్థాయిలో చట్టాలను మారుస్తున్న
కాలం ఇది.....
- చినవ్యాసుడు, మాఊరు.
chinavyasudu@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి