నిత్యనూతన భ్రాంతి

 



మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు

కైలాసానికి కోసుదూరం

పిల్లల కాలానికి

అది కరతుమ్మలు, జిల్లేళ్ళమయం

 

మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు

వైకుంఠానికి బొడ్రాయి

పిల్లల కాలానికి

కాలిరిగిన కొక్కిరాయి,

అది రెక్కలు తెగిన పావురాయి.

 

నాకు...  పుట్టి పెరిగిన ఊరు

బృందావనం, కాశ్మీరం

పిల్లల కాలానికి

అది పాడుబడ్డ శివాలయం.

....

అప్పుడు...

బంగారం పండిన నేల

ఇప్పుడు...

అది పైశాచిక హేల

మున్ముందు...

ఆశానిరాశల కల

ఆందోళనల అల 

ఇది నిత్య నూతన  లీల.


-చినవ్యాసుడు, మాఊరు



సవాళ్ళు, సమస్యలు కాళ్ళకు అడ్డుతగులుతుండే వర్తమానం ఎప్పుడూ భయంకరమే.

ఆ భయాందోళనలు లేని, ఎక్కడ తేలతామో తెలియక అనుక్షణం బుర్రలను తొలుచుకు తినే ఉత్కంఠలు లేని గతం ఎప్పుడూ ఆకర్షణీయమే...  సవాళ్ళనుండి క్షేమంగా బయటపడిన తరువాత వెనక్కి తిరిగి వాటిని తిరిగి చూసుకోవడం ఓ గొప్ప ఉపశమనం, ఓ పెద్ద ఓదార్పునిస్తుంటుంది...అప్పుడు భద్రంగా వడకట్టిన తేనెలా గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఎప్పుడూ మధురాతిమధురమే...

.... తాతలకయినా, నాన్నలయినా, మనకయినా......మన పిల్లలకయినా... 

బాల్యం/గతం ఎప్పటికీ సుమధుర జ్ఞాపకమే.


దానికి వర్తమానంతో  ముడిపెట్టి నిందించి ఏం ప్రయోజనం ?

......

నిత్యనూతన భ్రాంతి

  మా తాతకు...  పుట్టిపెరిగిన ఊరు కైలాసానికి కోసుదూరం పిల్లల కాలానికి అది కరతుమ్మలు , జిల్లేళ్ళమయం   మా నాన్నకు...  పుట్టిపెరిగిన ఊరు వైకుంఠా...