న్యాయం, ధర్మం ఒకటేనా !!!


 

న్యాయం-ధర్మం

 

న్యాయం, ధర్మం ఒకటేనా

అవి ఏకత్వంలో భిన్నత్వమా

భిన్నత్వంలో ఏకత్వమా...

 

అరటిపండు ఒకటిగా కనిపిస్తే

అది భిన్నత్వంలో ఏకత్వం

తొక్కతీసి గుజ్జును చూస్తే

అది ఏకత్వంలో భిన్నత్వం

 

తొక్క... న్యాయం, గుజ్జు... ధర్మం

గుజ్జు నోటికి చిక్కేవరకే తొక్క రక్షణ

ధర్మం అందేవరకే న్యాయ పరిరక్షణ

 

తోటకు మాలి శిక్షణ

కోర్టులకు వకీళ్ళే రక్షణ

ధర్మాసనాల్లో ధర్మదేవతలదే పర్యవేక్షణ

 

రాజ్యాంగానికి రక్తపరీక్ష చేసి

పేచీలకు మందు చీటీలు రాసిస్తే... న్యాయం

సమాజానికి సి.టి స్కాన్ చేసి

వ్యాజ్యాలనుదరికి చేరిస్తే...  ధర్మం

 

మాయ రోగాలు, దొంగ వేషాలు

రాజకీయ మర్మాలు.. కోర్టుల రాడార్లకు దొరికితే

నిప్పులు కక్కుతుంది మూడో కన్ను

వ్యవస్థల రక్షణకదే సరైన వ్యాక్సిను

 

 

-  చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...