మరో కొత్త రకం మాస్క్
పొరుగింటి తమ్ముడి మెడపై జలఖడ్గం
మబ్బుల్లేకుండా సెంటిమెంట్ పిడుగుల వర్షం
దహించివేస్తున్న వెన్నుపోటు ద్వేషం
ప్రత్యర్థుల ముందు కాళ్ళకు బంధం
రాజేంద్రుడి రథానికి ముందే దారి ధ్వంసం
ఆయుధ పూజలతో సేనలు సిద్ధం
అక్కడా ఇక్కడా ‘అయ్య’ చిలుకలోనే ప్రాణం
కీలెరిగి వాతపెడుతున్న వైనం
కొత్తగావచ్చి కట్టెలెగదోస్తున్న చెల్లికి చెక్
బాణాన్ని వదిలిన విలుకాడికి వార్నింగ్
ఒక్క దెబ్బకు వంద పిట్టల్
టక్కుటమారాలతో దొర విన్యాసాల్
జనం కళ్ళకు గంతలు
రాజకీయ కుప్పిగంతులు
- చినవ్యాసుడు, మాఊరు.
chinavyasudu@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి