నా దేవుడు


నా దేవుడు

 

 

నా దేవుడికి కులం ఉంది, బలం ఉంది

గోత్రం ఉంది, శాస్త్రం ఉంది

మతం ఉంది, గతం ఉంది

ఆస్తిఉంది, అంతస్తూ ఉంది 

బ్యాంకుల్లో ఖాతా ఉంది

 

ఆటా ఉంది పాటా ఉంది

ఊరేగడానికి వెహికలుంది

ఊగడానికో ఉయ్యాలుంది

 

కుళ్లు ఉంది, కుతంత్రం ఉంది

ద్వేషం ఉంది, రాజకీయం ఉంది

ప్రాంతం ఉంది, రాష్ట్రం ఉంది

వేషం ఉంది, రిజర్వేషన్ ఉంది

 

చలి ఉంది, గిలి ఉంది

కామం ఉంది,  కోరిక ఉంది

జెండా ఉంది, జెండర్ ఉంది

 

అందుకే వీడు నా దేవుడయ్యాడు

నేను తినేదే వాడు తింటాడు

డబ్బయినా, గడ్డయినా

ప్యూర్ వెజ్జయినా, నాన్వెజ్జయినా

 

ఇవేవీ లేనివాడు

దేవుడెట్లయితడు

అందుకే వాడు నా ఇష్టదైవం

నా కుల దైవం, నా గుల దైవం

 

 

-   చినవ్యాసుడు, మాఊరు

chinavyasudu@gmail.com

…………….

4 కామెంట్‌లు:

  1. బావుంది. "కులదైవం" అనే దాన్ని ఇలా ఇంటర్ ప్రిట్ చేయవచ్చని ఇప్పుడే అర్థం అయింది బాసూ!

    రిప్లయితొలగించండి
  2. దేవుడిని మనం చేరుకోవడం కాదు....అంటే దైవత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయడం లేదు... అలా చేయకపోగా మన స్థాయికి ఆయనను దిగజార్చేసాం... ఆయనను మనలో లీనం చేసుకున్నాం. ఆయనకు మోక్షమిచ్చేసాం.

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...