నా పబ్లిక్-నా రిపబ్లిక్

 


నా పబ్లిక్-నా రిపబ్లిక్

 

 

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

 

ఇది నా రాజ్యం...

ఇక్కడ రాజ్యాంగమే నా రక్షణ కవచం

రాజులుండరు, బంట్లుండరు

రాజ్యాంగం ఎవడి జాగీరూ కాదు

అందరూ కౌలుదార్లే,  అందరూ చౌకీదార్లే

 

జెండా ఎగరేసి చెబుతున్నా

సహజీవనంలో

స్వేచ్ఛ నీ మోచేతికింది నీరు కాదు

రాజ్యాంగం పీల్చి వదిలే గాలులే

ఇక్కడ నా జెండాకు స్వేచ్ఛావాయువులు

  

జన్మతః నేను హిందువును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా భారతీయత  గర్వపడాలి...

 

జన్మతః నేను ముసల్మానును

గర్వపడుతున్నా...

నన్ను చూసి నా మతమే కాదు

నా దేశప్రజలు  గర్వపడాలి...

  

జన్మతః నేను క్రిస్టియన్ ను

గర్వపడుతున్నా

నన్ను చూసి నా మతమే కాదు

నా  దేశ పతాకం  గర్వపడాలి...

 

జన్మతః నేను భారతీయుణ్ణి

గర్వపడుతున్నా...

నా భారతీయత ఇక

ఎవరెస్టంత ఎదగాలి...

ప్రపంచమంతటా వెలగాలి

  

భక్తి...

ఈ దేశానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ దేముడికీ మధ్య డీల్

  

కులం...

నా రాజ్యానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ సమాజానికి మధ్య డీల్

 

మతం

నా రాజ్యాంగానికి దాంతో సంబంధం లేదు

అది నీకూ నీ వర్గానికీ మధ్య డీల్

  

రిపబ్లిక్ డే నాడు చెబుతున్నా

పబ్లిగ్గా...భేషుగ్గా...

ఇదే నా మతం, నా ప్రజల అభిమతం

ఇదే నా దేశం, ఇదే నా పతాకం

జన్మజన్మల బంధం

ఇదే నా భారతీయం

  

- చినవ్యాసుడు,  మాఊరు

chinavyasudu@gmail.com

 

(ఆంధ్రజ్యోతి 26.1.2022)



6 కామెంట్‌లు:

  1. నా పబ్లిక్ - నా రిపబ్లిక్ చాలా బాగుంది .
    భారతీయత ...తామరాకులా ఉండాలి.
    భక్తి, మతం, కులం ... నీటి బొట్లలా ఉండాలి.
    నిగూఢమైన మీ సందేశం !
    ఉపయుక్తమైన ఉపదేశం !!

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...