గు‘లాబీ’.. ఇదోరకం

 



గు‘లాబీ’.. ఇదోరకం

  

అదో వనం

సప్తవర్ణ శోభితం

అక్కడ ఓ మొక్క మొలిచింది

సవాలక్ష మొక్కల్లో అదొక్కటే నిలిచింది

 

పూలు తక్కువ ముళ్ళు ఎక్కువ

వృక్షజాతి కాదు

వేళ్ళు బలహీనం

తీగజాతి

అల్లుకుపోతుంది

గిల్లుకుపోతుంది

పక్కనున్న మొక్కలను

కమ్మేసి, కప్పేసి

నలిమేసి, నులిమేసి

పీక పిసికేస్తుంది

  

దీని రంగు

చూపరులకు భంగు

అలంకారపు మొక్క

కాయలూ పళ్ళూ ఉండవు

దీని పూలు

పూజలు చేస్తాయి

సన్మానాలు చేస్తాయి

గిట్టని జాతుల

శవాలపై నర్తన కూడా చేస్తాయి

  

ఈ పువ్వున్నచోట

మరో పూవు పూయదు

పూయనీయదు

ప్రేమపుట్టినా, పగబట్టినా

దూరం దూరమే

ముళ్లే దాని కంచెయినా..కళ్ళయినా, 

  

భక్తుడికీ అందదు

శత్రువుకీ చిక్కదు

కందిరీగలు గోలచేసినా

కంటిచూపుతో చంపేస్తుంది

  

గల్లీల్లో పెంచలేం

కుండీల్లో నిలవదు

సొంత కమతంలోనే సాగవుతుంది

గడీల్లోనే గుబాళిస్తుంది

  

రేకులు ఎలా అంటే అలా  విచ్చుకోవు

గిరికీలు కొట్టినా

అన్ని సిద్ధులుతెలిసిన

హరి  చేతులకే  అందవు

  

చంద్రశిల  తాకినా

తారకమంత్రం తగిలినా

కవితాగానం సోకినా

విచ్చుకుంటాయి

అవే దాని పాస్ వర్డ్ లు

ఎంటర్ చేస్తే

సీతాకోకచిలుకలకే

తెరుచుకుంటాయి తలుపులు

  

తుఫానులొచ్చినా,

గాలీదుమారం రేగినా

బే ఫికర్....

ప్రమాదం పొంచి ఉన్నప్పుడు

మత్తుపొడులతో ముంచెత్తుతుంది

ఇదో రకం గులాబీ

లాబీ దానికి హాబీ

 

 

-చినవ్యాసుడు,  మాఊరు




10 కామెంట్‌లు:

  1. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చక్కగా అన్వయించారు. 👌👌👌

    రిప్లయితొలగించండి
  2. బాగుంది సార్
    DVR భాస్కర్...సాక్షి

    రిప్లయితొలగించండి
  3. చాలా వ్యంగంగా వుంది.చాలా బాగుంది

    N. రాజశేఖర్.సీనియర్ జర్నలిస్ట్

    రిప్లయితొలగించండి
  4. నేటి రాజకీయ అవస్థలపై చక్కని వ్యంగాస్త్రం.
    💐👍💐
    పో.ల.న.

    రిప్లయితొలగించండి
  5. లాబీ దానికి హాబీ👍perfect sir!

    Phaniharam Vallabhaacharyulu.

    Senior journalist

    రిప్లయితొలగించండి
  6. సూపర్ కవిత.. నర్మగర్భ కవిత. కానీ ఏదో ఒక రోజు ఇపుడిపుడే మొగ్గలిచ్చుకుంటున్న పారిజాత వనంలో ఆచూకీ లేక అలమటిస్తుంది. 🙏

    Mohan Raja Gopisetty

    రిప్లయితొలగించండి

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...